కర్నూలు జిల్లాలో కుప్ప‌కూలిన ఆ వృక్షం..అరిష్ఠానికి సంకేత‌మా..!

కర్నూలు జిల్లా పాలదార పంచదార వద్ద అతి ప్రాచీన భారీ వృక్షం నేలకు వరిగింది. మహాశివుడు ఫలభాగం నుండి వెలువడిన ఈ పాలదార పంచదారలు అత్యంత పవిత్రమైనవని భ‌క్తులు విశ్వ‌శిస్తారు. అంతేకాదు పంచముఖముల నుండి వెలువడిన పంచదారలు ఇక్క‌డ‌ కలిసి ప్రవహిస్తున్నాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానందలహరి, సౌందర్యంలహరి గ్రంధాలను వ్రాసారని వినికిడి. ఇంత పవిత్ర మైన ప్రదేశంలో రెండు రోజుల క్రితం గాలికి నెలకు వరిగిన వృక్షాన్ని […]

కర్నూలు జిల్లాలో కుప్ప‌కూలిన ఆ వృక్షం..అరిష్ఠానికి సంకేత‌మా..!

Updated on: Apr 21, 2020 | 10:12 PM

కర్నూలు జిల్లా పాలదార పంచదార వద్ద అతి ప్రాచీన భారీ వృక్షం నేలకు వరిగింది. మహాశివుడు ఫలభాగం నుండి వెలువడిన ఈ పాలదార పంచదారలు అత్యంత పవిత్రమైనవని భ‌క్తులు విశ్వ‌శిస్తారు. అంతేకాదు పంచముఖముల నుండి వెలువడిన పంచదారలు ఇక్క‌డ‌ కలిసి ప్రవహిస్తున్నాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానందలహరి, సౌందర్యంలహరి గ్రంధాలను వ్రాసారని వినికిడి. ఇంత పవిత్ర మైన ప్రదేశంలో రెండు రోజుల క్రితం గాలికి నెలకు వరిగిన వృక్షాన్ని దేవస్థానం అధికారులు ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంత పురాత‌న ప్రాముఖ్య‌త క‌లిగి వృక్షం కూలిపోవ‌డం ఏదో అశుభానికి సంకేతం అని భ‌క్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.