Snow Fall: భారీగా కురుస్తోన్న హిమపాతం.. స్థంభించిన జన జీవనం. మంచు ఎలా కురుస్తుందో ఓసారి చూడండి..

|

Jan 09, 2021 | 1:16 PM

Heavy Snow Fall in Jammu: సాధారణంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోందని అంటుంటాం. అయితే ఎడతెరపి లేకుండా మంచు కురిస్తే ఎలా ఉంటుంది. ఏంటి ఆ దృశ్యం ఊహకు కూడా అందట్లేదు కదా.?

Snow Fall: భారీగా కురుస్తోన్న హిమపాతం.. స్థంభించిన జన జీవనం. మంచు ఎలా కురుస్తుందో ఓసారి చూడండి..
Follow us on

Heavy Snow Fall in Jammu: సాధారణంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోందని అంటుంటాం. అయితే ఎడతెరపి లేకుండా మంచు కురిస్తే ఎలా ఉంటుంది. ఏంటి ఆ దృశ్యం ఊహకు కూడా అందట్లేదు కదా.? కానీ శ్రీనగర్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
శ్రీనగర్‌లో శనివారం ఉదయం నుంచి భారీగా మంచు కురుస్తోంది. ఎంతలా అంటే వర్షం చినుకులు పడుతున్నంతలా.. దీంతో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. భారీగా కురుస్తోన్న హిమపాతం కారణంగా నగరంలో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రోడ్లపై సుమారు 100 మీటర్ల వరకు ఏం కనిపించని పరిస్థితి ఉంది. ఇక ఈ పరిస్థితులు అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తోన్న మంచు కురుస్తోన్న సన్నివేశాలు మాత్రం మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. శ్రీనగర్‌లో కురుస్తోన్న హిమపాతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

శ్రీనగర్‌లో మంచుకురుస్తోన్న దృశ్యాలు..

Also Read: Benefits Of Clove Tea: పోపుల పెట్టె మన ఆయుర్వేదశాల.. లవంగ టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..