రాత్రి నుంచి చెన్నై మహానగరంలో కుండపోత వర్షం

|

Oct 29, 2020 | 8:28 AM

చెన్నై మహానగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుండటంతో జనావాసాలు నీటిలో చిక్కుకుపోయాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్ లలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఉత్తర తమిళనాడు, నైరుతి […]

రాత్రి నుంచి చెన్నై మహానగరంలో కుండపోత వర్షం
Follow us on

చెన్నై మహానగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుండటంతో జనావాసాలు నీటిలో చిక్కుకుపోయాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్ లలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.