
Rain Alert In Andhra Pradesh: ఏపీ ప్రజలకు కూల్ న్యూస్. చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాగాల మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో ఇప్పటికే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక రాబోయే మూడో రోజుల్లో ఏయే ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న వివరాలను వాతావరణ కేంద్రం తెలిపింది. అవి ఇలా ఉన్నాయి.
ఉత్తర కోస్తాంధ్రా, యానాం: ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రా: ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ : ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉండగా.. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..