తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు..

| Edited By:

Jun 24, 2019 | 11:27 AM

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు చురుగ్గా కదలడంతో.. జోరుగా వానలు కురుస్తున్నాయి. మొన్నటివరకు ఎండతాపంతో.. చుక్క నీరు లేక అల్లాడిపోయిన ప్రజలకు వరుణుడి రాకతో ఉపశమనం నెలకొంది. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదును చేసి రెడీగా ఉంచుకున్న భూములు.. వర్షం రాకతో.. మట్టి పరిమళాలు వెదజల్లుతున్నాయి. కాగా.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో 78.3 శాతం వర్షపాతం నమోదైయింది. […]

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు..
Follow us on

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు చురుగ్గా కదలడంతో.. జోరుగా వానలు కురుస్తున్నాయి. మొన్నటివరకు ఎండతాపంతో.. చుక్క నీరు లేక అల్లాడిపోయిన ప్రజలకు వరుణుడి రాకతో ఉపశమనం నెలకొంది. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదును చేసి రెడీగా ఉంచుకున్న భూములు.. వర్షం రాకతో.. మట్టి పరిమళాలు వెదజల్లుతున్నాయి.

కాగా.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో 78.3 శాతం వర్షపాతం నమోదైయింది. ఏపీలో కూడా 90 శాతం వర్షపాతం నమోదైనయిట్టు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా..తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణ, కోస్తాలలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ ఏడాది సాగుకు అవసరమైనంత వర్షపాతం నమోదుకానుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు.