ఢిల్లీలో భారీ వర్షాలు.. ఒకరి మృతి..

| Edited By:

Jul 19, 2020 | 1:47 PM

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి ఉదయం కురిసిన వర్షాలతో రోడ్లు,లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఐటీఓ తిలక్ బ్రిడ్జి, మింటో బ్రిడ్జి

ఢిల్లీలో భారీ వర్షాలు.. ఒకరి మృతి..
Follow us on

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి ఉదయం కురిసిన వర్షాలతో రోడ్లు,లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఐటీఓ తిలక్ బ్రిడ్జి, మింటో బ్రిడ్జి, ఎయిమ్స్, ప్రగతి మైదాన్, మథుర రోడ్, జిటికె డిపో, ఆజాద్‌పూర్ అండర్‌పాస్, గురు నానక్ చౌక్, సౌత్ అవెన్యూ రోడ్, ఎంబి రోడ్‌లోని ప్రహ్లాద్‌పూర్ అండర్‌పాస్, పహర్‌గంజ్, కిషన్ గంజ్, ఆజాద్ మార్కెట్, కంజవాలా-కరాలా రోడ్, మూల్‌చంద్ అండర్‌పాస్, లజ్‌పత్ నగర్, ఎయిమ్స్, బాత్రా హాస్పిటల్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కీలక రహదారులపై భారీ వర్షం కురవడంతో ఒకరు నీట మునిగి చనిపోయారు.

రైల్వే అండర్ బ్రిడ్డి కింద నీటిలో ఒక బస్సు చిక్కుకోగా అందులోని డ్రైవర్ మునిగి మృతి చెందాడు. ఢిల్లీలోని మింటో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు కురిసిన వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఉదయం ఆ నీటిలో ఒక బస్సు చిక్కుకుపోయింది. అనంతరం ఆ బస్సు ముందు నీటిపై తేలుతున్న ఒక మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌మాన్ రామ్‌నివాస్ మీనా చూశారు. వెంటనే ఈదుకొంటూ వెళ్లి ఆ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.

కాగా.. చనిపోయిన వ్యక్తిని కుందన్‌గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆయన బస్సు డ్రైవర్ అని, ఉదయం నీట మునిగిన వంతెన కింద నుంచి బస్సును నడిపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో బస్సు నీటిలో చిక్కుకుపోవడంతో 60 ఏళ్ల డ్రెవర్ కుందన్ నీటిలో మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు.

[svt-event date=”19/07/2020,11:30AM” class=”svt-cd-green” ]