మళ్లీ జంటనగరాల్లో భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్

|

Oct 19, 2020 | 5:56 PM

గ్రేటర్ వాసులను వర్ష వస్తే హడలిపోతున్నారు. చినుకు పడితే చాలు చిగురుటాకులా వణికిపోతున్నారు. గత వారం భారీ వర్షాలు భాగ్యనగరంలో బీభత్సవం సృష్టించి వెళ్లింది

మళ్లీ జంటనగరాల్లో భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
Follow us on

గ్రేటర్ వాసులను వర్ష వస్తే హడలిపోతున్నారు. చినుకు పడితే చాలు చిగురుటాకులా వణికిపోతున్నారు. గత వారం భారీ వర్షాలు భాగ్యనగరంలో బీభత్సవం సృష్టించి వెళ్లింది. ఈ వరద నీటిని నుంచి తెరుకోకముందే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. నాంపల్లి, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, చందానగర్, మియాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే హైదరాబాద్ చిత్తడిగా మారింది. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకులమైంది. ముంపు కష్టాలు గ్రేటర్ వాసులను వెంటాడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు ఏడు రోజులుగా వణుకుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయా ఇళ్లల్లో వరద నీరు నిలబడే ఉంది. నిత్యావసరాలు, వస్త్రాలు కొట్టుకుపోయి.. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి దుస్తులు లేక తడిచిన వాటితోనే చలికి వణుకుతున్నారు. అడుగు బయట అడుగుపెట్టే పరిస్థితి నెలకొంది.