హర్యానాలో హోరెత్తిన రైతుల నిరసన ప్రదర్శనలు

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2020 | 3:19 PM

వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఆదివారం హర్యానాలో ఆదివారం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ బిల్లులు తమకు నష్టం కలిగించేవేనని, తమ ప్రయోజనాలకు పూర్తి విరుధ్ధమని ఆరోపిస్తున్న..

హర్యానాలో హోరెత్తిన రైతుల నిరసన ప్రదర్శనలు
Follow us on

వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఆదివారం హర్యానాలో ఆదివారం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ బిల్లులు తమకు నష్టం కలిగించేవేనని, తమ ప్రయోజనాలకు పూర్తి విరుధ్ధమని ఆరోపిస్తున్న అన్నదాతలు జాతీయ రహదారులపై రాస్తారోకో ఆందోళన చేపట్టారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హర్యానా పోలీసులతో బాటు ఢిల్లీ పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించారు. అటు పంజాబ్ లో కూడా రైతులు నిరసనలతో నేషనల్ హైవేలను హోరెత్తించారు.

హర్యానా, పంజాబ్ మంత్రుల్లో పలువురు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. వీటి వల్ల అన్నదాతలకు మేలు జరగకపోగా కీడే జరుగుతుందని, వీటిని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.