సీఎం జగన్‌పై ఫేమ‌స్ హెయిల్ స్టైలిస్ట్ జావెద్‌ హబీబ్ ప్రశంసల వ‌ర్షం..

ఏపీ సీఎం జగన్మోహన్‌‌రెడ్డిని ఫేమ‌స్ హెయిర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ ప్రశంసల‌తో కొనియాడారు. బుధ‌వారం ‘జగనన్న చేదోడు’ పథకం కింద నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించడం గొప్ప విష‌యం అని పేర్కొన్నారు .

సీఎం జగన్‌పై ఫేమ‌స్ హెయిల్ స్టైలిస్ట్ జావెద్‌ హబీబ్ ప్రశంసల వ‌ర్షం..

Edited By:

Updated on: Jun 10, 2020 | 6:52 PM

ఏపీ సీఎం జగన్మోహన్‌‌రెడ్డిని ఫేమ‌స్ హెయిర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ ప్రశంసల‌తో కొనియాడారు. బుధ‌వారం ‘జగనన్న చేదోడు’ పథకం కింద నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించడం గొప్ప విష‌యం అని పేర్కొన్నారు .

‘కోవిడ్-19 ప్ర‌స్తుతం ప్రపంచం స్థితిగ‌తుల‌ను పూర్తిగా మార్చివేసింది. వృత్తి వ్య‌వ‌స్థ‌ల‌ను దెబ్బ‌తీసింది . ఈ స‌మ‌యంలో ఏపీ‌ ముఖ్యమంత్రి వైఎస్ ఒక‌ ఒక కొత్త స్కీమ్ ప్ర‌వేశ‌పెట్టారు. ఆ పథకం పేరే ‘జగనన్న చేదోడు’. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు భ‌రోసా ఇచ్చేందుకు తీసుకొచ్చిన గొప్ప‌ పథకం ఇది. ఒకేసారి వీరంద‌రికీ రూ. 10 వేల సాయం అందుతుంది. యావ‌త్ దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌. బిగ్‌ థ్యాంక్స్‌ టు యూ’’ అంటూ ‘జగనన్న చేదోడు’ పథకం ప్ర‌వేశ‌పెట్ట‌డంపై జావెద్‌ హబీబ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇదే క్ర‌మంలో క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ‘జగనన్న చేదోడు’ పథకం ఆస‌రాగా నిలుస్తుంద‌ని సెలబ్రిటీ స్టైలిస్ట్‌ హర్మన్‌ కౌర్‌ అన్నారు.

కాగా ఏపీ సీఎం జ‌గ‌న్ నేడు క్యాంపు ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ‘జగనన్న చేదోడు’ పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 2.47 లక్షల మంది ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us