ప్లాస్టిక్ కాలుష్యం జలచరాల ప్రాణాలనూ తీస్తోంది. స్పెయిన్ లోని క్యానరీ దీవుల్లో ఓ మత్స్య కారుడి గాలంలో చిక్కుకున్న ఓ చేపను బయటకు తీసి చూస్తే.. అది ఎందుకో అతనికి అసాధారణ రీతిలో కనిపించిందట.. వెంటనే దాని కడుపుచీల్చి చూస్తే ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన ఈ మత్స్య కారుడు తన స్నేహితుల చెవిన వేశాడు. అది అలా.. యాస్మిన్ స్కాట్ అనే ట్విటర్ యూజర్ కు తెలియగానే .. ఈ వింతకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఒక నిముషం 40 సెకండ్ల పాటు నిడివి ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒక చిన్న చేపలోనే ప్లాస్టిక్ ముక్కలుంటే ఇక చాలావరకు భారీ షార్క్ చేపలు, తిమింగలాలు స్వాహా చేస్తే వాటి కడుపులో ఎంత మేరకు ప్లాస్టిక్ ఉంటుందో వేరే చెప్పాలా అంటున్నారు..
Fish found with a stomach full of plastic. pic.twitter.com/ymdkwGmAsb
— Yasmin Scott (@YASMINSCOTTREAL) January 22, 2020
Shocked fishermen discover three plastic bags stuck in the throat of a groper fish they had just caught near the Bahamas — ANY MORE PERSONS WANNA MAKE NOISE ABOUT THE PLASTIC BAGS ? pic.twitter.com/5gopz1IT7b
— Latrae Rahming (@p0sitivechange) January 14, 2020