భారత్‌ను వీడని అండర్‌వాల్డ్‌ డాన్ నెట్‌వర్క్..24 ఏళ్ల తర్వాత పట్టుబడిన దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు

|

Dec 27, 2020 | 7:34 PM

అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు మరోసారి రుజువయ్యింది. డీ గ్యాంగ్‌ ముఖ్య అనుచరుడు మాజిద్ కుట్టీని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 24 ఏళ్ల నుంచి మాజిద్‌ కుట్టి కోసం పోలీసులు..

భారత్‌ను వీడని అండర్‌వాల్డ్‌ డాన్ నెట్‌వర్క్..24 ఏళ్ల తర్వాత పట్టుబడిన దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు
Follow us on

అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు మరోసారి రుజువయ్యింది. డీ గ్యాంగ్‌ ముఖ్య అనుచరుడు మాజిద్ కుట్టీని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 24 ఏళ్ల నుంచి మాజిద్‌ కుట్టి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు జార్ఖండ్‌లో చిక్కాడు మాజిద్‌ కుట్టి.

1996 నుంచి ఆయన కోసం వెదుకుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. 106 పిస్టల్స్‌ , 4 కిలోల ఆర్డిఎక్స్‌ను దావూద్‌ గ్యాంగ్‌ కోసం సేకరించినట్టు మాజిద్‌ కుట్టీపై అభియోగాలున్నాయి. కుట్టీతో పాటు ఈ కేసుతో సంబంధమున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పేలుళ్ల కేసులో కూడా కుట్టీకి సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

1997లో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా గుజరాత్, మహారాష్ట్రలో బాంబు పేలుళ్లు జరిపేందుకు అతడు ప్రయత్నించాడు. పాకిస్తాన్‌ ఏజెన్సీ ఆదేశాల మేరకు దావూద్ ఇబ్రహీం పంపిన పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో నిందితుడైన అబ్దుల్ మజీద్ కుట్టిని అరెస్ట్‌ చేశారు.