లక్ష టన్నుల ఉల్లిని సరఫరా..: కేంద్ర మంత్రి తోమర్

|

Oct 29, 2020 | 8:21 PM

ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష టన్నుల ఉల్లిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే విదేశాలకు ఉల్లి ఎగుమతులపై

లక్ష టన్నుల ఉల్లిని సరఫరా..: కేంద్ర మంత్రి తోమర్
Follow us on

Onion Buffer Stock : ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష టన్నుల ఉల్లిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే విదేశాలకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించామని అన్నారు. ఇతర దేశాల నుంచి మరింత ఉల్లిని దిగుమతి చేసేందుకు రూట్ క్లియర్ చేశామని వెల్లడిచారు.

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్‌ వ్యతిరేకించడంపై తోమర్‌ మండిపడ్డారు. ఆ పార్టీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ట్రేడ్‌ ఫ్రీ రెగ్యులేషన్స్‌ కి పెద్ద పీట వేస్తామని, అంతర్రాష్ట్ర వ్యాపారాన్ని ప్రోత్సహిస్తామని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొంటూ కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి ప్రోత్సాహమిచ్చే దిశగా చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు బీజేపీ  ప్రభుత్వం అదేపని చేస్తే ఓర్వలేకపోతోందని విమర్శించారు.