Marriage Age in UK: బ్రిటన్‌లో బాల్యవివాహాలకు ఇక చెక్.. పెరగనున్న చట్టబద్ధ వివాహ కనీస వయస్సు

|

Jun 12, 2021 | 10:23 AM

హక్కుల సంఘాల పోరాటం ఫలించనుంది. బ్రిటన్‌లో చట్టబద్ధ వివాహ కనీస వయస్సును పెంచేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించింది. వివాహం చేసుకునేందుకు బ్రిటన్‌లో..

Marriage Age in UK: బ్రిటన్‌లో బాల్యవివాహాలకు ఇక చెక్.. పెరగనున్న చట్టబద్ధ వివాహ కనీస వయస్సు
UK Marriage Age
Follow us on

బ్రిటన్‌లో హక్కుల సంఘాల పోరాటం ఫలించనుంది. దేశంలో చట్టబద్ధ వివాహ కనీస వయస్సును పెంచేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. వివాహం చేసుకునేందుకు బ్రిటన్‌లో 18 వయస్సు పూర్తికావాల్సి ఉంది. అయితే తల్లిదండ్రుల ఆమోదం ఉంటే యువతీయువకులు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు. ఈ మినహాయింపును సాకుగా చూపుతూ ప్రతియేటా భారీ సంఖ్యలో యువతీయువకులు 16 ఏళ్లు నిండీనిండకముందే పెళ్లి చేసుకుంటున్నారు. పరిపక్వత లేని వయస్సులో వివాహం జరగడంతో చాలా మంది కొన్నేళ్లకు విడాకులతో విడిపోతున్నారు. వివాహ కనీస వయస్సు విషయంలో ఈ మినహాయింపు కరెక్ట్ కాదని హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. చట్టబద్ధ కనీస వివాహ వయోపరిమితిని పెంచాలని దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తున్నాయి. బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఈ మినహాయింపు ఉందంటూ వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

అటు ఈ చట్టంలో మార్పులు చేయాలంటూ గత మాసం నలుగురు యువతులు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. ప్రస్తుత చట్టంలోని లొసుగులు దేశంలో జరుగుతున్న బాల్యవివాహాలకు కారణమవుతున్నాయని అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై బ్రిటన్ న్యాయ మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. బ్రిటన్, వేల్స్‌లో చట్టబద్ధ వివాహ వయోపరిమితిని 18 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన చట్ట సవరణను త్వరలోనే తీసుకురానున్నట్లు హక్కుల సంఘాలకు రాసిన ఓ లేఖలో బ్రిటన్ న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి..

వర్షాకాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ చిట్కాలను పాటించండి..