తెలంగాణ పట్టణవాసులకు శుభవార్త.. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించిన సర్కార్

తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఆగస్టు 26వ తేదీ వరకు వరకు కటాఫ్‌ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్‌ఎస్‌ స్కీమ్‌‌ను ప్రకటించింది.

తెలంగాణ పట్టణవాసులకు శుభవార్త.. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించిన సర్కార్

Updated on: Sep 01, 2020 | 3:08 PM

తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఆగస్టు 26వ తేదీ వరకు కటాఫ్‌ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్‌ఎస్‌ స్కీమ్‌‌ను ప్రకటించింది. టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుంది. అక్టోబర్‌ 15లోగా ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌ నింపాలని ప్రభుత్వం సూచించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1000, లే అవుట్‌ అప్లికేషన్‌ ఫీజు రూ.10వేలు, రెగ్యులరైజేషన్‌ ఫీజులు 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి రూ.200 ఉంటుందని, 100 గజాల నుంచి 300 గజాల వరకు గజానికి రూ.400 ఉంటుందని, రెగ్యులరైజేషన్‌ ఫీజు 300 గజాల నుంచి 600 వరకు గజానికి రూ.600 రెగ్యులరైజేషన్‌ చార్జీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.