అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్…

హైదరాబాద్ లోని అమెరికా వీసా కార్యాలయం తిరిగి తెరుచుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 21న తాత్కాలికంగా..

అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్...

Updated on: Aug 17, 2020 | 5:26 PM

US VISA Application Centres Re-open in Hyderabad  : హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ ఐదు నెలల తర్వాత తెరుచుకుంది. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థి వీసాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. లిమిటెడ్‌ బేసిస్‌లో విజిటర్‌ వీసాలకు అపాయింట్‌మెంట్స్‌ ఇస్తున్నారు. నిబంధనలు అనుసరించి ఎమర్జెన్సీ వీసాలకు దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఐదు నెలలుగా యూఎస్‌ ఎంబసీ మూసి వేసి ఉంది. ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఇప్పడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. మళ్లీ కార్యక్రమాలు ప్రారంభించారు.

వైరస్‌ కారణంగా కొద్ది మంది వినియోగదారులనే అనుమతిస్తున్నట్టు.. ముందుగా ఈ నెల 12 లోపు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశమని తెలిపింది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి సంఖ్య పెంచుతామని పేర్కొంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న మూడు వారాల్లోనే వీసా పక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. విద్యార్థులు, విద్యావేత్తలకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us