దిగివస్తోన్న పసిడి

|

Aug 25, 2020 | 9:02 PM

కొంతకాలంగా చుక్కలు చూపిస్తూ పైపైకి ఎగసిన పసిడి దిగొస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం నాటికి వరుసగా ఐదో రోజూ తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా..

దిగివస్తోన్న పసిడి
Follow us on

కొంతకాలంగా చుక్కలు చూపిస్తూ పైపైకి ఎగసిన పసిడి దిగొస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం నాటికి వరుసగా ఐదో రోజూ తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా ఈ నెల గరిష్టస్ధాయి నుంచి 5000 రూపాయలు దిగివచ్చింది బంగారం. mcx లో పదిగ్రాముల బంగారం 228 రూపాయలు తగ్గి 51,041 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి రూ. 769 తగ్గి 64,800 రూపాయలకు దిగివచ్చింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై ఆశలు, అమెరికా-చైనా వాణిజ్య బంధంపై సానుకూల సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడానికి కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.