ఉత్తరప్రదేశ్ రామ్‌పూర్‌లోని సుమలి నగర్‌లో చిత్రమైన పెళ్లి జరిగింది.. పెళ్లంటే మామూలు పెళ్లి కాదది… వధువు తరఫు వాళ్లు జీవితాంతం గుర్తు పెట్టుకునేట్టుగా జరిపించారు.. ఆ పెళ్లి ముచ్చటమేమిటంటే.. ప్రేమించిన అమ్మాయిని కలుసుకోడానికి అర్థరాత్రిపూట తోటరాముడిలా ఆమె ఇంటికే వెళ్లాడో సాహస ప్రేమికుడు.. ఎంత చాటుమాటుగా కలుసుకుందామనుకున్నా పాపం అమ్మాయి ఇంటివాళ్లకు దొరికిపోయాడా ప్రేమికుడు.. అంత రాత్రిపూట అమ్మాయి కోసం వచ్చిన వ్యక్తి దొరికితే ఎందుకు ఊరుకుంటారు? పాపం రాత్రంతా గదిలో బంధించి చితక్కొట్టారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు.. తెల్లారిన తర్వాత అతడిని సమీపంలోని అజిమ్‌నగర్ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. విషయమంతా కనుక్కున్న పోలీసులు అమ్మాయి, అబ్బాయి తరపు పెద్దలను స్టేషన్‌కు పిలిపించారు.. అక్కడే ఇద్దరు మధ్య రాజీ కుదిర్చారు.. మొత్తానికి పెళ్లికి ఇరుపక్షాలను ఒప్పించారు.. అంతే .. ఆ ఉదయమే ప్రేమికులకు పెళ్లి చేశారు.. పాపం రాత్రంతా ఓ రకమైన సన్మానం.. ఉదయం మరో రకమైన సత్కారం.. ఇంత జరిగిన తర్వాత ఈ పెళ్లిని ఆ అబ్బాయి ఎలా మర్చిపోగలడు చెప్పండి..?