లాక్‌డౌన్ ఎఫెక్ట్: గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లుసుకునేందుకు లేడీ గెట‌ప్‌.. కానీ..

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 1:35 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో గుజ‌రాత్‌లోని వల్సాడ్‌‌లో

లాక్‌డౌన్ ఎఫెక్ట్: గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లుసుకునేందుకు లేడీ గెట‌ప్‌.. కానీ..
Follow us on

Girl gets up at midnight: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో గుజ‌రాత్‌లోని వల్సాడ్‌‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఒక యువ‌కుడు త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లుసుకోలేని ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగైనా ఆమెను క‌లుసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. యువ‌తి వేషంలో ఆమెను క‌లుసుకునేందుకు బ‌య‌లుదేరాడు. కానీ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

వివరాల్లోకెళితే.. పార్డీ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల‌ యువ‌కుడు యువ‌తి గెట‌ప్‌లో రోడ్డుమీద‌కు వెళితే పోలీసులు ప్ర‌శ్నించర‌ని భావించి, పంజాబీడ్రెస్ వేసుకుని ప్రేయ‌సిని క‌లుసుకునేందుకు బ‌య‌లు దేరాడు. అయితే రాత్రి పూట ఆడ‌వేషంలో వెళుతున్న ఆ యువ‌కుడిని చూసి పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో వారు ఎక్క‌డ‌కు వెళుతున్నార‌ని అడిగారు. పోలీసులు పదేపదే ప్ర‌శ్నించినా ఆ యువకుడు నోరు విప్పలేదు.

కాగా.. వారు అత‌ని ముఖంపై ఉన్న ముసుగు తొల‌గించి ఆశ్చ‌ర్య‌పోయారు. ఆడ వేషంలో వెళితే ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌ర‌ని భావించి ఇలా వెళుతున్నాన‌ని అత‌ను పోలీసుల‌కు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.