బల్దియా ఎన్నికలకు మరికొద్ది గంటలే సమయం.. గ్రేటర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

|

Nov 30, 2020 | 7:11 AM

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిలకు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల కమీషన్. పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మిగిలింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

బల్దియా ఎన్నికలకు మరికొద్ది గంటలే సమయం.. గ్రేటర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!
Follow us on

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిలకు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల కమీషన్. పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మిగిలింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, అభ్యర్ధుల వివరాలివే..

బల్దియా ఎన్నికల్లో మరి కొద్ది గంటల్లో ఓటర్ తీర్పు ఇవ్వనున్నాడు. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారధి వెల్లడించారు. ఈసారి గ్రేటర్‌లో ఈవీఎం పద్దతిలో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సిబ్బంది డిసెంబర్ 1వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని..6 గంటల వరకూ పోలింగ్ ఏజెంట్లు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమీషనర్ సూచించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 150 డివిజన్లకు గానూ 1,122 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

ఓటర్లు, అభ్యర్ధులు, పోలింగ్ స్టేషన్ల వివరాలివేః

  • మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256, పురుషులు 38,89,637, స్త్రీలు 35,76,941, ఇతరులు 678
  • మొత్తం వార్డుల సంఖ్య 150, పోటి చేసే అభ్యర్తుల సంఖ్య 1,122
  • టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149, కాంగ్రెస్ 146, టి.డి.పి 106, ఎం.ఐ.ఎం 51, సి.పి.ఐ 17, సి.పి.ఎం 12, రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415.
  • డిసెంబర్ 1న ఉ. 5:30గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి.
  • ఉ. 6గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకావాలి.
  • ఉ. 6గంట‌ల నుండి 6:15గంట‌ల మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది.
  • ఉ. 6:55 గంట‌ల‌కు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయ‌డం జ‌రుగుతుంది.
  • ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య 60, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ల సంఖ్య 30
  • మొత్తం పోలింగ్ సిబ్బంది 36,404
  • పోలింగ్ అధికారులు 9,101, సహాయ పోలింగ్ అధికారులు 9,101, ఇతర పోలింగ్ సిబ్బంది 18,202
  • మొత్తం రిటర్నింగ్ అధికారులు 150, సహాయ రిటర్నింగ్ అధికారులు 150
  • సాధారణ పరిశీలకులు 12, వ్యయ పరిశీలకులు 30
  • మైక్రో అబ్జర్వర్ లు 1,700, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2,920
  • మొత్తం బ్యాలెట్ బాక్స్‌ల సంఖ్య 18,202
  • పోస్టల్ బ్యాలెట్ల కై అందిన దరఖాస్తులు 2,629
  • ఉ. 7గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం.
  • సా. 6గంట‌ల‌కు పోలింగ్ పూర్తి అవుతుంది.
  • కోవిడ్-19 పాజిటీవ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం.
  • ఓట‌రు గుర్తింపు కార్డులేని ఓట‌ర్ల‌కు ఎంపిక చేసిన 21 ఇత‌ర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ అవ‌కాశం.
  • ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో వృద్దులు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్ల ఏర్పాటు.
  • ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో మౌలిక స‌దుపాయాల ఏర్పాటు.
  • మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటీవ్, 2934 సెన్సిటీవ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
  • జిహెచ్ఎంసి ఎన్నికల్లో 2,909 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి.
  • వీటిలో 450 పోలింగ్ లొకేషన్లు హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు గా ఉన్నాయి.
  • 921 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు, 1548 పోలింగ్ లొకేషన్లు నార్మల్ గా ఉన్నాయి.
  • ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులతో పటిష్ఠ బందోబస్తు.
  • జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు.
  • 150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగం.
  • కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి.
  • ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది