GHMC Elections 2020: సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ సజ్జనార్‌ పర్యటన..

గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌. సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్ పరిశీలించారు..

GHMC Elections 2020: సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ సజ్జనార్‌ పర్యటన..

Updated on: Dec 01, 2020 | 5:59 PM

గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌. సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్ పరిశీలించారు. కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లి లోని పలు డివిజన్లలోని పోలింగ్ బూత్ లను పర్యవేక్షించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని కొండాపూర్, హఫీజ్‌పేట్‌, ప్రేమ్‌నగర్ లలోని పలు పోలింగ్ స్టేషన్ లను సీపీ సందర్శించారు. కొన్ని చదురు మదురు సంఘటనల మినహా అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు. ఎవరైనా ఎటువంటి గొడవలకు పాల్పడినా, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్ కోరారు.