GHMC Elections: 2020ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కవిత

|

Dec 01, 2020 | 12:40 PM

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రేటర్‌ ఎన్నికల సందర్బంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని బీఏవీ స్కూల్‌లో కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

GHMC Elections: 2020ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కవిత
Follow us on

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రేటర్‌ ఎన్నికల సందర్బంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని బీఏవీ స్కూల్‌లో కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం పరిపూర్ణం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కాబట్టి ఓటు హక్కుకలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటువేయాలని కోరారు. హైద్రాబాద్ లో ఎప్పుడు కూడ పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని.. కానీ, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.