గంగూలీ ఫ్యామిలీలో కరోనా కలకలం

బీసీసీఐ అధ్యక్షుడు, ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ సోదరుడు, మాజీ రంజీ క్రికెటర్‌ స్నేహశీష్‌ సతీమణికి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగూలీ వదినతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా కొవిడ్-19 పాజిటివ్ గా తేలింది.

గంగూలీ ఫ్యామిలీలో కరోనా కలకలం

Updated on: Jun 20, 2020 | 4:22 PM

కరోనా కల్లోలం దేశ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల దాకా కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. శనివారం అతని సోదరుడు, మాజీ రంజీ క్రికెటర్‌ స్నేహశీష్‌ సతీమణికి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగూలీ వదినతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా కొవిడ్-19 పాజిటివ్ గా తేలింది. అయితే, గంగూలీ సోదరుడు స్నేహశీశ్‌కు మాత్రం నెగిటివ్‌ వచ్చింది. ఇక స్నేహశీష్‌ ఇంట్లోని పని మనిషి కూడా వైరస్‌ బారినపడింది. దీంతో ఆ నలుగురినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గంగూలీ కుటుంబం నివసించే ఇంట్లో కాకుండా వారు వేరే చోట ఉంటున్నారు. డగా మహమ్మారి బారిన పడ్డారు.