క్లియోపాత్ర పాత్రలో గాల్‌ గాడోట్‌

|

Oct 14, 2020 | 10:08 AM

సాహసవంతురాలు, ధైర్యశీలి అయిన ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర జీవితం ఆధారంగా మరో సినిమా వస్తోంది.. ఈసారి రూపొందించబోతున్న సినిమాలో క్లియోపాత్ర వేషాన్ని హాలీవుడ్‌ అందాల తార, ఇజ్రాయెల్‌కు చెందిన...

క్లియోపాత్ర పాత్రలో గాల్‌ గాడోట్‌
Follow us on

సాహసవంతురాలు, ధైర్యశీలి అయిన ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర జీవితం ఆధారంగా మరో సినిమా వస్తోంది.. ఈసారి రూపొందించబోతున్న సినిమాలో క్లియోపాత్ర వేషాన్ని హాలీవుడ్‌ అందాల తార, ఇజ్రాయెల్‌కు చెందిన గాల్‌ గాడోట్‌ ధరిస్తున్నారు..ప్రపంచంలోనే మహా సౌందర్యవేత్త అయిన క్లియోపాత్ర వేషాన్ని వేయడమంటే మాటలు కాదు.. గాల్‌ గాడోట్‌ ఆ పాత్రకు సరిపోతారనే అనిపిస్తోంది.. తను మహారాణి పాత్రను పోషిస్తున్నానని గాల్‌ గాడోట్‌ ట్వీట్‌ చేసింది.. దర్శకురాలు ప్యాటీ జెన్కిన్స్‌తో కలిసి క్లియోపాత్ర జీవితాన్ని సినిమాగా రూపొందిస్తున్నందుకు సంతోషంగా ఉందని గాడోట్‌ ట్వీట్టర్‌లో పేర్కొంది. క్లియోపాత్ర కథను మహిళా దృష్టి కోణంలో చూపించబోతున్నామని తెలిపింది.. ప్యాటీ జెన్కిన్స్‌తో కలిసి పని చేసిన అనుభవం గాడోట్‌కు ఉంది.. ఆమె దర్శకత్వంలో వండర్‌ ఉమెన్‌లో నటించింది.. హాలీవుడ్‌లో ఇంతకు ముందు వచ్చిన క్లియోపాత్ర పాత్రను ఎలిజిబెత్‌ టేలర్‌ పోషించారు.. 1963లో వచ్చిన ఆ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించడమే కాకుండా నాలుగు ఆస్కార్‌ అవార్డులను కూడా గెలుచుకుంది..