ముగిసిన విజయ నిర్మల అంత్యక్రియలు

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మ‌ృతి చెందిన ప్రముఖ సినీ నటి విజయనిర్మల అంత్యక్రియలు ముగిసాయి. చిలుకూరు విజయకృష్ణ గార్డెన్‌లో కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులు, సినీ రాజకీ ప్రముఖుల సమక్షంలో విజయనిర్మల కుమారుడు నరేశ్ ఆమె చితికి నిప్పంటించారు. బాలనటిగా తెలుగు తెరకు పరిచయమై, నటిగా ఎదిగి, దర్శకురాలిగా మారిన విజయనిర్మల గిన్నీ‌స్‌బుక్‌లో సైతం చోటు సంపాదించుకున్నారు. ఆమె మ‌ృతిచెందారన్న వార్తతో యావత్ దక్షిణాది సినిమారంగం కన్నీటి పర్యంతమైంది. శుక్రవారం ఉదయం వరకు అభిమానుల సందర్శనార్ధం నానక్‌రామ్ […]

ముగిసిన విజయ నిర్మల అంత్యక్రియలు

Updated on: Jun 28, 2019 | 3:14 PM

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మ‌ృతి చెందిన ప్రముఖ సినీ నటి విజయనిర్మల అంత్యక్రియలు ముగిసాయి. చిలుకూరు విజయకృష్ణ గార్డెన్‌లో కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులు, సినీ రాజకీ ప్రముఖుల సమక్షంలో విజయనిర్మల కుమారుడు నరేశ్ ఆమె చితికి నిప్పంటించారు.

బాలనటిగా తెలుగు తెరకు పరిచయమై, నటిగా ఎదిగి, దర్శకురాలిగా మారిన విజయనిర్మల గిన్నీ‌స్‌బుక్‌లో సైతం చోటు సంపాదించుకున్నారు. ఆమె మ‌ృతిచెందారన్న వార్తతో యావత్ దక్షిణాది సినిమారంగం కన్నీటి పర్యంతమైంది. శుక్రవారం ఉదయం వరకు అభిమానుల సందర్శనార్ధం నానక్‌రామ్ గూడలో గల నివాసంలో ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. అటు తర్వాత అక్కడినుంచి ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చారు. అక్కడినుంచి చిలుకూరులో ఉన్న విజయాగార్డెన్‌కి తరలించి ఆమెకు అంత్యక్రియలు జరిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us