ఆ మూడు మండలాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్

|

Jul 31, 2020 | 6:41 PM

తాజాగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో కట్టడికి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు.......

ఆ మూడు మండలాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్
Follow us on

Full lockdown in Three Mandals of Krishna district : కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. పెరుగుతున్న కరోనా సంఖ్యతో ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రాల వారిగా కాకుండా జిల్లాల వారిగా, మండలాల వారికిగా లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో కట్టడికి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అవనిగడ్డ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలకు మాత్రమే అనుమతించారు. నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాల్లో కొత్త లాక్‌డౌన్ నిబంధనలను అములు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వెల్లడించారు.