
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98 వ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్లో… పీవీ ఘనతను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ అనుభవజ్ఞుడైన పీవీ నరసింహారావు కష్ట కాలంలో దేశాన్ని సమర్థంగా నడిపించి చరిత్రలో నిలిచారని, గొప్ప పండితుడు కూడా అయిన ఆయన… దేశాభివృద్దికి బాటలు వేశారని అన్నారు. మోదీతో బాటు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన ట్విట్టర్లో స్పందిస్తూ.. పీవీని బహు భాషావేత్త, రాజనీతిజ్ఞుడు, దేశ ఆర్ధిక వ్యవస్థకు అవసరమైన అమూల్యమైన సంస్కరణలు తెచ్చి … అభివృధ్దికి బాటలు పరచిన దార్శనికుడని ‘ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్ఠీఆర్, పీవీ నరసింహారావుతో దిగిన ఫోటోను ఆయన షేర్ చేశారు.
బహుభాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన ఒకే ఒక్క తెలుగువాడు, దేశ ఆర్ధికవ్యవస్థలో అమూల్యమైన సంస్కరణలతో అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు శ్రీ పీవీ.నరసింహరావుగారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/7HXodLjKa4
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2019