మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావుకు కరోనా

| Edited By:

Jul 04, 2020 | 11:40 AM

మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా సోకింది. కరోనా టెస్ట్‌లో తనకు పాజిటివ్‌గా తేలిందని మాణిక్యాలరావు స్వచ్ఛందంగా ఓ వీడియోను విడుదల చేసి ప్రకటించారు.

మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావుకు కరోనా
Follow us on

మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా సోకింది. కరోనా టెస్ట్‌లో తనకు పాజిటివ్‌గా తేలిందని మాణిక్యాలరావు స్వచ్ఛందంగా ఓ వీడియోను విడుదల చేసి ప్రకటించారు. ఈ సందర్బంగా కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కరోనా సోకకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని మాణిక్యాలరావు ఆ వీడియోలో సూచించారు. కరోనా గాలి ద్వారా కూడా సోకుతుండడంతో మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.

కరోనా సోకితే ఏమీ కాదని.. కానీ గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని  మాణిక్యాల రావు పేర్కొన్నారు. మాస్క్ వాడుతూ, సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇక వీలైనంత వరకు ఇతరులతో కారులో ప్రయాణం చేయొద్దని ఆయన సూచించారు. కాగా ఇటీవలే తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, జీజేపీ నేతకు కరోనా సోకింది. ఆయనతో కారులో మాణిక్యరావు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అయితే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ చిన్న-పెద్ద, ధనిక-పేద, కులుం-మతం, రంగు బేధం లేకుండా అందరికీ సోకుతున్న విషయం తెలిసిందే.