మహారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రికి క‌రోనా..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి శివాజీరావు పాటిల్-నీలంగేక‌ర్(88) కు క‌రోనా పాజిటివ్ గా

మహారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రికి క‌రోనా..

Updated on: Jul 17, 2020 | 10:23 AM

Former Maharashtra CM Shivajirao Patil: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి శివాజీరావు పాటిల్ (88) కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న‌ను లాతూరు జిల్లా నుంచి చికిత్స నిమిత్తం పుణె ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మాజీ సీఎంకు క‌రోనా సోక‌డంతో.. ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. కాగా.. మ‌హారాష్ట్రలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,75,640 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 10,928 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 1,11,801 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us