ఆ ఘటనను చూస్తే.. రోడ్డుపై నడవాలంటేనే జడుసుకుంటారు..!

|

Jul 31, 2020 | 11:52 PM

నిత్యం ఎన్నో ప్రమాదాలు మన కళ్ల ముందు జరుగుతుంటాయి. ఎక్కువగా అనుకోకుండా జరిగిన ప్రమాదాలే ఇప్పటివరకూ చూసుంటారు. ఇక్కడ జరిగిన ప్రమాదం ఇది కూడా సాధ్యమా అనిపిస్తుంది. బెంగళూరులో జరిగని ఈ ఘటన సోషల్‌ మీడియాలో వీడియో మాత్రం బాగా హల్‌చల్ చేస్తోంది

ఆ ఘటనను చూస్తే..  రోడ్డుపై నడవాలంటేనే జడుసుకుంటారు..!
Follow us on

నిత్యం ఎన్నో ప్రమాదాలు మన కళ్ల ముందు జరుగుతుంటాయి. ఎక్కువగా అనుకోకుండా జరిగిన ప్రమాదాలే ఇప్పటివరకూ చూసుంటారు. ఇక్కడ జరిగిన ప్రమాదం ఇది కూడా సాధ్యమా అనిపిస్తుంది. బెంగళూరులో జరిగని ఈ ఘటన సోషల్‌ మీడియాలో వీడియో మాత్రం బాగా హల్‌చల్ చేస్తోంది. రోడ్డుపై లూజుగా వేలాడుతున్న వైరు ఓ ఆటో టైరులో చిక్కుకుంది. దాన్ని తొలగించడం కోసం ఆటోడ్రైవర్ కిందకు దిగాడు. ఇంతలో ఏమైందో ఆ వైరు ఒక్కసారిగా బలంగా గాల్లోకి లేచింది. దాన్ని పట్టుకొనే ఉన్న ఆటోడ్రైవర్ కూడా వైరుతో సహా ఒక్క ఉదుటున గాల్లోకి లేచాడు. అదే సమయంలో రోడ్డుపై దూరంగా వెళ్తున్న సునీత అనే 42 ఏళ్ల మహిళపై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె గాయాలకు 52 కుట్లు పడ్డాయని పోలీసులు తెలిపారు. అయితే అనూహ్యంగా జరిగిన ఈ ఘటనలో ఆటోడ్రైవర్‌కు ఎలాంటి గాయం కాకపోవడం విచిత్రం.