
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీయల్ పార్క్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఆ ఘటన చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఈ భారీ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం ఏం జరగలేదని తెలుస్తోంది. నగరంలోని సికంద్రా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
చిన్నగా మొదలైన మంటలు కొన్ని క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగలు బయటకు పురుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన రసాయనిక ఫ్యాక్టరీ సమీపంలోనే కూరగాయల మార్కెట్ కూడా ఉన్నది. అయితే ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. భారీ స్థాయిలో నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఫ్యాక్టరీ సమీపంలో ఏం జరుగుతోందో గుర్తు పట్టకుండా మారిపోయింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.