ఎరువుల ఫ్యాక్టరీలో మంటలు.. ఒకరు మృతి

|

Aug 17, 2020 | 10:28 PM

మహారాష్ర్టలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని సేంద్రీయ రసాయన కర్మాగారంలో సోమవారం మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఎరువుల ఫ్యాక్టరీలో మంటలు.. ఒకరు మృతి
Follow us on

మహారాష్ర్టలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని సేంద్రీయ రసాయన కర్మాగారంలో సోమవారం మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా కలెక్టర్ తెలిపారు. పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ మున్సిపాలిటీలోని నండోలియా ఆర్గానిక్ కెమిక‌ల్స్‌ కంపెనీలో ప్రమాదావశాత్తు మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. సిబ్బంది సమాచారం మేరకు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు సమయంలో 20 మంది ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు పాల్ఘర్ కలెక్టర్ కైలాస్ షిండే తెలిపారు. 15 మందిని సురక్షితంగా బయటకు తరలించగా ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఒకరు మరణించగా మృతదేహం కోసం సహాయక బృందాలు గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, ప్రస్తుతం ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారని ఆయన తెలిపారు.