సుశాంత్ కేసులో అతని సిస్టర్స్ పై రియా చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఎఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సరికాదని సీబీఐ తెలిపింది. ఇది చట్టప్రకారం సమంజసం కాదని బాంబే హైకోర్టుకు విన్నవించుకుంది. ఆ సిస్టర్స్ పై రియా ఆరోపణలు ఊహాజనితంగా ఉన్నాయని, అసలు ఇవి తమ దర్యాప్తులో భాగంగా ఉండాలని ఈ దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. సుశాంత్ మృతికి సంబంధించి ముంబై పోలీసులవద్ద గానీ, రియా వద్ద గానీ సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని వారు అన్నారు. అంతే తప్ప బాంద్రా పోలీసు స్టేషన్ లో సుశాంత్ సిస్టర్స్ మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. తమపై పెట్టిన కేసును కొట్టివేయాలన్న సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక సింగ్, మీతూ సింగ్ అభ్యర్థనను వారు సమర్థించారు,