Eggs for Babies: పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి? రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిది?

గుడ్డు సూపర్ ఫుడ్. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు గుడ్డు తనిపిస్తే అందులోని ప్రోటీన్, ఖనిజాలు, ఇతర అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మందికి తమ పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి? రోజుకు ఎన్ని గుడ్లు ఇవ్వాలి? అనే సందేహం మిగిలిపోతుంది..

Eggs for Babies: పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి? రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిది?
Eggs For Babies
Follow us

|

Updated on: Apr 18, 2024 | 12:40 PM

గుడ్డు సూపర్ ఫుడ్ అంటారు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు గుడ్డు తనిపిస్తే అందులోని ప్రోటీన్, ఖనిజాలు, ఇతర అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మందికి తమ పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి? రోజుకు ఎన్ని గుడ్లు ఇవ్వాలి? అనే సందేహం మిగిలిపోతుంది.

పిల్లలకు ఏ వయస్సు నుండి గుడ్లు తినిపించాలి?

నిజానికి.. ఆరు నెలల తర్వాత పిల్లలకు గుడ్లు ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఈ వయస్సు నుంచి వారికి ఎక్కువ పోషకాహారం అవసరం. గుడ్డులో పుష్కలంగా ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?

బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చినప్పటి నుంచి గుడ్లు ఇవ్వడం ప్రారంభించాలి. అయితే మొదట్లో సగం గుడ్డు మాత్రమే తినిపించాలి. నెమ్మదిగా అలవాటు చేయాలి. దీనితో పాటు మరికొన్ని ఆహారాలు కూడా తినిపించాలి. తద్వారా పిల్లలకు అలెర్జీ ఉందో లేదో తెలుసుకోవచ్చు. క్రమంగా పిల్లవాడు పెరుగుతున్నప్పుడు సగం గుడ్డుకు బదులుగా మొత్తం గుడ్డు ఇవ్వడం ప్రారంభించాలి. బిడ్డకు ఏడాది వయస్సు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ మొత్తం గుడ్డు తినిపించవచ్చు. ఇది బిడ్డ ఎదుగుదలకు సహాయపడటమే కాకుండా పిల్లల ఎముకలను బలపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల కండరాలను బలపరుస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, ఇ పిల్లల ఎముకలతో పాటు కళ్లకు బలం చేకూరుస్తాయి.

గుడ్డులోని ఏ భాగాన్ని ఆహారంగా ఇవ్వాలి?

మీ చిన్నారికి మొదటిసారి గుడ్లు ఇస్తున్నట్లయితే పసుపు భాగంతో ప్రారంభించాలి. ఆపై క్రమంగా గుడ్లను తినడం ప్రారంభించినప్పుడు మొత్తం గుడ్డుకు ఆహారంగా ఇవ్వొచ్చు.

గుడ్లు తినిపించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

కొంతమంది పిల్లలకు గుడ్లు అంటే ఎలర్జీ రావచ్చు. కాబట్టి మొదట కొద్దిగా మాత్రమే గుడ్డు తినిపించాలి. అలెర్జీ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు ఎప్పుడూ తాజా గుడ్లు మాత్రమే తినిపించాలి. ఎక్కువ కాలం ఉంచిన గుడ్లు ఇవ్వకూడదు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.