అన్నం పెట్టే అన్నదాతలు వారు.. ఆదుకోండి, రైతుల ఆందోళనపై స్పందించిన ప్రియాంక చోప్రా

| Edited By: Anil kumar poka

Dec 07, 2020 | 2:23 PM

రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్  పూర్తి మద్దతును ప్రకటించారు. వారి ఆందోళన సహేతుకమేనని ఆమె ట్వీట్ చేశారు.

అన్నం పెట్టే అన్నదాతలు వారు.. ఆదుకోండి, రైతుల ఆందోళనపై స్పందించిన ప్రియాంక చోప్రా
Follow us on

రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్  పూర్తి మద్దతును ప్రకటించారు. వారి ఆందోళన సహేతుకమేనని ఆమె ట్వీట్ చేశారు. వారి నిరసనపై కేంద్రం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రైతులను ప్రియాంక భారత ‘ఫుడ్ సోల్జర్స్’ గా అభివర్ణించారు. అన్నదాతల భయాలను పోగొట్టాలని, వారి ఆశలు తీర్చాలని, సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని ప్రియాంక చోప్రా కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ విషయంలో పంజాబీ సింగర్, యాక్టర్ కూడా అయిన దిల్ జిత్ దొసంజీ చేసిన ట్వీట్లను ఆమె సమర్థించారు.

అటు-గతవారమంతా  దొసంజీకి, మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి మధ్య నడిచిన ట్విటర్ వార్  రైతుల ఆందోళనపై సెలబ్రిటీల వివిధ మనస్తత్వాలను ప్రతిబింబించింది. సోషల్ మీడియాలో వీరి ఆరోపణలు,  ప్రత్యారోపణలు హాట్ హాట్ గా నడిచాయి. అన్నదాతల ఆందోళనను హేళన చేస్తూ కంగనా చేసిన ట్వీట్లపై భగ్గుమన్న దొసంజీ అదే స్థాయిలో ఆమెపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా ఓ వంద రూపాయలిస్తే ఈ నిరసనలో పాల్గొనేందుకు ఏ మహిళ అయినా వస్తుందంటూ కంగనా.. 60 ఏళ్ళ పేద వృధ్ద మహిళను ఉద్దేశించి చేసిన ట్వీట్ పై ఆయన నిప్పులు కురిపించాడు. నువ్వు బీజేపీకి వత్తాసు పలుకుతూ ఈ ఆందోళనను అవహేళన చేస్తున్నావని..ఇలా ఆమెపై ధ్వజమెత్తాడు.