ప్రముఖ గేయ, కథా రచయిత సదానంద అస్తమయం

|

Aug 25, 2020 | 5:58 PM

ప్రముఖ గేయ, కథా రచయిత కలువకొలను సదానంద(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా పాకాలలో తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ గేయ, కథా రచయిత సదానంద అస్తమయం
Follow us on

ప్రముఖ గేయ, కథా రచయిత కలువకొలను సదానంద(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా పాకాలలో తుదిశ్వాస విడిచారు. 1939 ఫిబ్రవరి 22న పాకాలలో జన్మించిన ఆయన అధ్యాపక వృత్తిని ఎంచుకున్నారు. కలువ కొలను కృష్ణయ్య, నాగమ్మ దంపతులకు ఆయన తల్లిదండ్రులు. సుమారు 36 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించి 1997లో పదవీ విరమణ చేశారు. ఉపాధ్యాయ వృత్తిపాటు సాహిత్యంలో మంచి పట్టున్న సదానంద అనేక కథలు, గేయాలను రచించారు.

తన 18వ ఏటనే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించిన సదానంద.. ఇప్పటి వరకు 200 పైగా కథలు, 100పైగా గేయాలు, 8 కథా సంపుటాలు, రెండు నవలలు రాశారు. ఆయన అందించిన కథతో 1980లో ‘బంగారు బావా’ చిత్రం విడుదలైంది. సదానంద రచించిన ‘బంగారు నడిచిన బాట’ నవలకు 1966లో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బాల సాహిత్య పురస్కారం దక్కింది. బాలసాహిత్య పురస్కారం అందుకున్న తొలి తెలుగు సాహిత్యకారుడు సదానందే. ఆయన రచించిన ‘నవ్వే పెదవులు ఏడ్చే కళ్లు’ కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. సదానంద మృతికి పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.