Family Man-2 Coming On: మనోజ్ భాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో హిట్‌గా నిలిచింది.
దీంతో చిత్ర యూనిట్ ఫ్యామిలీ మ్యాన్-2కి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక రెండో సీజన్‌లో అక్కినేని కోడలు సమంత నటిస్తుండడం విశేషం. సౌత్ ఆడియన్స్‌ను ఆట్రాక్ట్ చేయడానికే చిత్ర యూనిట్ సమంతను తీసుకుందని అప్పట్లో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే ఇందులో సమంత కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తాజాగా సీజన్2 విడుదల తేదికి సంబంధించి సమంత కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా ప్రోమో వీడియోను పోస్ట్ చేసిన సమంత.. ‘ఈసారి ఎవరు తప్పించుకోలేరు. వెనకాల కనిపిస్తోన్న ముఖంలో రహస్యమంతా దాగి ఉంది’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది. ఈ లెక్కన ఈ వెబ్ సిరీస్‌లో సమంత ఉగ్రవాదిగా కనిపించనుందని గతంలో వచ్చిన వార్తలకు బలం చేకూర్చినట్లయింది. మరి ఇప్పటి వరకు తన అందంతో ఆకట్టుకున్న ఈ అందాల తార విలన్‌గా ఎంత వరకు భయపెట్టిస్తుందో చూడాలి. ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ అండ్ డీకేలు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
This time, no one is safe! #WhoisRaji
Chehre ke peeche chehra, raaz hai ismein gehra ?#TheFamilyManOnPrime on 12th Feb#TheFamilyManSeason2 #TheFamilyManOnPrime@rajndk @BajpayeeManoj @PrimeVideoIN pic.twitter.com/9XzMtS3YYd— Samantha Akkineni (@Samanthaprabhu2) January 7, 2021
Also Read: Vakeel Saab : వైరల్ అవుతున్న’వకీల్ సాబ్’ ఫోటోలు.. సంబరపడుతున్న అభిమానులు