Chicken Prices: దేశంలో బర్డ్ ప్లూ వల్ల పౌల్ట్రీ వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇప్పటికే రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలో చికెన్తినేందుకు నగరవాసులు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో అత్యధికంగా చికెన్ అమ్ముడుపోయే హైదరాబాద్‌లో కూడా ధరలు అమాంతం పడిపోతున్నాయి. కోడి గుడ్ల ధరలు సైతం అదేబాటలో పయనిస్తున్నాయి. భాగ్యనరంలో సాధారణ రోజుల్లో లక్ష కిలోల చికెన్అమ్మకాలు జరుగుతుండగా ప్రస్తుతం సగానికి పడిపోయాయని వ్యాపారులు ఆందోళను చెందుతున్నారు. డిసెంబర్ తో పోలిస్తే చికెన్ ధరలతో పాటు అమ్మకాలు కూడా భారీగా తగ్గాయి. డిసెంబర్ చివరి వరకు కిలో రూ.250 పలికిన చికెన్ ధర ప్రస్తుతం రూ.150కి చేరుకుంది.
రోజు రోజుకూ ధరలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజు ల్లో మరింతగా ధరలు పడిపోయే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఇందులో సుమారు 30 నుంచి 40 శాతం చికెన్ అమ్మకాలు హైదరాబాద్ నగరంలోనే జరుగుతాయి. ప్రతీ నిత్యం హైదరాబాద్ నగరంలో సుమారు లక్ష కిలోలకు పైగా ఇటీవల వరకు చికెన్ అమ్మకాలు జరిగేవి. గత పది రోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో వీటి అమ్మకాలు సగానికిపైగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా చలి కాలంలో చికెన్ అమ్మకాలు అధికంగా ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేప థ్యంలో గత వారం వరకు ఓ మోస్తరుగా ఉన్న చికెన్ అమ్మ కాలు నేడు సగానికి పడిపోయాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు లేకున్నా ప్రజలు చికెన్ తినడానికి ముందుకు రావడం లేదు.