‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..

విమర్శల నేపథ్యంలో.. ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్‌ లవ్లీ’గా మార్చినట్టు హిందుస్తాన్‌ యూనిలివర్‌ (హెచ్‌యూఎల్‌) గురువారం ప్రకటించింది. ఉత్పత్తి పేరు నుంచి ఫెయిర్

‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..

Updated on: Jul 03, 2020 | 5:43 AM

Fair and Lovely cream rebranded Glow and Lovely: విమర్శల నేపథ్యంలో.. ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్‌ లవ్లీ’గా మార్చినట్టు హిందుస్తాన్‌ యూనిలివర్‌ (హెచ్‌యూఎల్‌) గురువారం ప్రకటించింది. ఉత్పత్తి పేరు నుంచి ఫెయిర్‌ అన్న పదాన్ని తొలగించింది. అందానికి సంబంధించి సానుకూల దృక్పథాన్ని దృష్టిలో తీసుకుని నూతన పేరును నిర్ణయించినట్టు వివరించింది. వచ్చే కొన్ని నెలల్లో గ్లో అండ్‌ లవ్లీ పేరుతో ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని, భవిష్యత్తు ఆవిష్కరణలు సైతం ఈ దిశగానే ఉంటాయని పేర్కొంది.

నల్లగా ఉన్నవారిని కించపరిచే విధంగా పేరు ఉందని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో హిందుస్తాన్‌ యూనిలివర్ ఈ నిర్ణయం తీసుకుంది. పురుషులకు సంబంధించిన సౌందర్య సాధనాలను గ్లో అండ్‌ హ్యాండ్‌సమ్‌గా పిలవనున్నట్టు హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమెరికాకు చెందిన ఎఫ్‌ఎంసీజీ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను ఇప్పటికే నిలిపివేయగా, ఫ్రెంచ్‌ కంపెనీ ఎల్‌ఓరియల్‌ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వైటెనింగ్‌ పదాలను తొలగించనున్నట్టు గత వారం ప్రకటించింది.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..

Loading...
Unable to load recommendations.
Follow Us