Moeen Ali Corona Positive: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆ జట్టు టెస్టు సిరీస్ కోసం శ్రీలంకలో అడుగు పెట్టారు. హంబతోట ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించడంతో ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
లంక ప్రభుత్వం క్వారంటైన్ ప్రోటోకాల్ ప్రకారం మొయిన్ అలీ 10 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. పేస్ బౌలర్ క్రిస్ వోక్స్.. అలీతో కాంటాక్ట్ కాగా.. అతడ్ని కూడా కొద్దిరోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఇద్దరికీ క్వారంటైన్ గడువు ముగిసిన అనంతరం మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు. కాగా, మిగిలిన ఆటగాళ్లకు మంగళవారం కరోనా టెస్టులు నిర్వహించిన తర్వాత ప్రాక్టిస్ సెషన్‌కు అనుమతించనున్నారు.