బంతికి లాలాజల వినియోగం.. శానిటైజ్ చేసిన అంపైర్లు

|

Jul 20, 2020 | 12:17 PM

క్రికెట్ లో బౌలర్ చేతికి బంతిని అందించే ముందు ఫీల్డర్ దానిపై లాలాజలం రుద్ది మెరుపు తేవ‌డం గత దశాబ్దాలుగా కొనసాగుతోన్న ప్ర‌క్రియ‌. ఎక్కువ‌గా.. టెస్టు మ్యాచ్‌ సమయంలో బంతి నుంచి స్వింగ్‌ని రాబట్టేందుకు బౌలింగ్ టీమ్‌ తరచూ బంతిపై లాలాజలం రుద్దుతూ ఉంటారు.

బంతికి లాలాజల వినియోగం.. శానిటైజ్ చేసిన అంపైర్లు
Follow us on

క్రికెట్ లో బౌలర్ చేతికి బంతిని అందించే ముందు ఫీల్డర్ దానిపై లాలాజలం రుద్ది మెరుపు తేవ‌డం గత దశాబ్దాలుగా కొనసాగుతోన్న ప్ర‌క్రియ‌. ఎక్కువ‌గా.. టెస్టు మ్యాచ్‌ సమయంలో బంతి నుంచి స్వింగ్‌ని రాబట్టేందుకు బౌలింగ్ టీమ్‌ తరచూ బంతిపై లాలాజలం రుద్దుతూ ఉంటారు. కాగా.. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో.. బంతిపై లాలాజలం లేదా చెమటని రుద్దడాన్ని ఐసీసీ ఇటీవల బ్యాన్ చేసింది. ఒక‌వేళ ఫీల్డింగ్ టీమ్ మ‌ర్చిపోయి రెండు సార్లు ఈ మిస్టేక్ చేస్తే.. 5 ర‌న్స్ పెనాల్టీని కూడా విధిస్తామని ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.

తాజాగా ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు సిరీస్ నాలుగో రోజు ఇంగ్లాండ్​ ఫీల్డ‌ర్​ డొమినిక్​ సిబ్లే అనుకోకుండా బంతిపై ఉమ్మి రుద్దేశాడు. అయితే వెంట‌నే త‌న త‌ప్పిదాన్ని గ‌మనించి అంపైర్ల‌కు విష‌యాన్ని తెలియ‌జేశాడు. దీంతో అక్కడే ఉన్న అంపైర్లు అప్రమత్తమై త‌మ వ‌ద్ద ఉన్న టిష్యూల‌తో బంతికి శానిటైజేషన్​ చేశారు. అనంతరం మ్యాచ్ య‌ధావిదిగా కొనసాగించారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ని కంప్లీట్ బయో- సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తున్నారు నిర్వాహ‌కులు. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులకి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించి నెగటివ్ వస్తేనే ఆటలోకి అనుమతిస్తున్నారు.