ఎలక్షన్‌ కౌంటింగ్‌కి కౌంట్‌డౌన్ క్లాసెస్..

ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇంకా.. ఆరు రోజులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల యంత్రాంగం.. కౌంటింగ్‌కి ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. మరోవైపు పార్టీలు సైతం కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లకు వైసీపీ శిక్షణా కార్యక్రమం చేపట్టింది. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాల్లో ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు మాజీ సీఎస్ అజయ్ కల్లం, ఐఏఎస్ శ్యామూల్ శిక్షణ ఇస్తున్నారు. వైసీపీ […]

ఎలక్షన్‌ కౌంటింగ్‌కి కౌంట్‌డౌన్ క్లాసెస్..

Edited By:

Updated on: May 16, 2019 | 1:13 PM

ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇంకా.. ఆరు రోజులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల యంత్రాంగం.. కౌంటింగ్‌కి ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. మరోవైపు పార్టీలు సైతం కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లకు వైసీపీ శిక్షణా కార్యక్రమం చేపట్టింది. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాల్లో ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు మాజీ సీఎస్ అజయ్ కల్లం, ఐఏఎస్ శ్యామూల్ శిక్షణ ఇస్తున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సహా సీనియర్ నేతలు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌంటింగ్ టైంలో ఏజెంట్ల విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తున్నారు.