తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. మే 2న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 10న నామినేషన్ల పరిశీలిస్తారు. ఇక మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Mlc Election Schedule
Follow us

|

Updated on: Apr 25, 2024 | 9:53 PM

తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. మే 2న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 10న నామినేషన్ల పరిశీలిస్తారు. ఇక మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక, జూన్‌ 5న ఫలితాలను వెల్లడించనుంది ఈసీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఏడాదిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉండగా.. ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పల్లా. మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 76 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడ్డారు. నోటిఫికేషన్‌ రాగానే కాంగ్రెస్ తరపున క్యాండిడేట్‌ను అనౌన్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ తరుపున చింతపండు నవీన్‌ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన చింతపండు నవీన్‌ టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతపండు నవీన్‌ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు పల్లా గెలుపొందారు. ఇక బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి వాసుదేవరెడ్డి, రాకేష్‌రెడ్డిలో పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీని కాపాడుకునేందుకు బీఆర్ఎస్.. అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహారిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..