ప‌శ్చిమ‌బెంగాల్‌లో రెండు చోట్ల కంపించిన భూమి

ఈశాన్య భారతం భూప్రకంపనలతో మరోసారి వణికిపోయింది. ప‌శ్చిమ‌బెంగాల్‌లో బుధ‌వారం ఉద‌యం రెండు వేర్వేరుచోట్ల భూకంపం సంభ‌వించింది. ఆ రాష్ట్రంలోని దుర్గాపూర్‌, బర్హంపూర్‌లో భూమి స్వ‌ల్పంగా కంపించింద‌ని నేష‌న‌ల్ సీస్మొల‌జీ సెంట‌ర్ (ఎన్ఎస్‌సీ‌) ప్ర‌క‌టించింది.

ప‌శ్చిమ‌బెంగాల్‌లో రెండు చోట్ల కంపించిన భూమి

Updated on: Aug 26, 2020 | 11:02 AM

ఈశాన్య భారతం భూప్రకంపనలతో మరోసారి వణికిపోయింది. ప‌శ్చిమ‌బెంగాల్‌లో బుధ‌వారం ఉద‌యం రెండు వేర్వేరుచోట్ల భూకంపం సంభ‌వించింది. ఆ రాష్ట్రంలోని దుర్గాపూర్‌, బర్హంపూర్‌లో భూమి స్వ‌ల్పంగా కంపించింద‌ని నేష‌న‌ల్ సీస్మొల‌జీ సెంట‌ర్ (ఎన్ఎస్‌సీ‌) ప్ర‌క‌టించింది. దుర్గాపూర్‌లో ఈరోజు ఉద‌యం 7.54 గంట‌ల‌కు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీని తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేల్‌పై 4.1గా న‌మోదయ్యింద‌ని ఎన్ఎస్‌సీ తెలిపింది. భూకంప కేంద్రం దుర్గాపూర్‌కు 110 కి.మీ. దూరంలో ఉన్న‌ద‌ని తెలిపింది. భూ అంత‌ర్భాగంలో 10 కి.మీ. లోప‌ల సంభ‌వించింద‌ని వెల్ల‌డించింది. ‌

ఈరోజు తెల్ల‌వారుజామున బ‌‌ర్హంపూర్‌కు 30 కి.మీ. దూరంలో భూమి కంపించింది. దీని తీవ్ర‌త 3.8గా న‌మోద‌య్యింద‌ని యూరోపియ‌న్ మెడిటేరియ‌న్ సీస్మొల‌జిక‌ల్ సెంట‌ర్ వెల్ల‌డించింది. ఈ భూకంపం సుమారు 8 గంట‌ల ప్రాంతంలో వ‌చ్చిన‌ట్లు తెలిపింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.