పోలవరం ప్రాజెక్టు వద్ద బీటలు.. భయాందోళనలో కార్మికులు

|

Apr 28, 2019 | 1:04 PM

పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి బీటలు వారింది. దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రాజెక్టు సమీపంలో ఉన్న త్రివేణి వర్క్ షెడ్ దగ్గర భూమి బీటలు వారింది. దీంతో భయపడిన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇకపోతే ప్రాజెక్టు వద్ద తరుచూ ఇదే విధంగా జరగుతుందటంతో పని చేస్తున్న సిబ్బంది, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. కొండల బ్లాస్టింగ్ వల్ల భూమి కంపించింది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమి చీలిన చోట నుంచి […]

పోలవరం ప్రాజెక్టు వద్ద బీటలు.. భయాందోళనలో కార్మికులు
Follow us on

పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి బీటలు వారింది. దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రాజెక్టు సమీపంలో ఉన్న త్రివేణి వర్క్ షెడ్ దగ్గర భూమి బీటలు వారింది. దీంతో భయపడిన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇకపోతే ప్రాజెక్టు వద్ద తరుచూ ఇదే విధంగా జరగుతుందటంతో పని చేస్తున్న సిబ్బంది, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. కొండల బ్లాస్టింగ్ వల్ల భూమి కంపించింది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమి చీలిన చోట నుంచి వెంటనే మిషన్లు, వాహనాలను, సామాగ్రిని తరలించారు.

మరోవైపు గతంలో కూడా ప్రాజెక్టు సమీపంలోని ఉన్న రోడ్డుపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు స్పిల్ వే రెస్టారెంట్ సమీపంలో భూమికి ఒక్కసారిగా పగుళ్లు సంభవించాయి. దీంతో డ్యామ్ నిర్మాణాన్ని సందర్శించేందుకు వచ్చిన సందర్శకులు, ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ఇది ఇలా ఉంటే అక్కడ ఉన్న మట్టిలో తేమశాతం తగ్గినప్పుడు ఇలాంటి పగుళ్లు ఏర్పడటం సహజమేనని ఇంజనీర్లు చెబుతున్నారు.