తెలంగాణ వ్యక్తికి రూ.1.52కోట్ల బిల్లు మాఫీ చేసి.. దుబాయ్ ఆసుపత్రి ఉదారత

దుబాయ్‌లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వం చాటుకుంది. ఓ భారతీయునికి కరోనా చికిత్స కోసం అయిన రూ.1.52కోట్ల బిల్లును మాఫీ చేసింది.

తెలంగాణ వ్యక్తికి రూ.1.52కోట్ల బిల్లు మాఫీ చేసి.. దుబాయ్ ఆసుపత్రి ఉదారత

Edited By:

Updated on: Jul 16, 2020 | 10:41 AM

దుబాయ్‌లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వం చాటుకుంది. ఓ భారతీయునికి కరోనా చికిత్స కోసం అయిన రూ.1.52కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతేకాదు ఫ్లైట్ టికెట్ ఇచ్చి, జేబులో రూ.10వేలు పెట్టి మరీ అతడిని ఇండియాకు పంపింది.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగమట్లకు చెందిన ఓడ్నాల రాజేష్‌(42) ఏప్రిల్‌ 23న దుబాయ్‌లో కరోనాతో ఆసుపత్రిలో చేరాడు. 80 రోజుల తరువాత కోలుకున్న అతడికి రూ.1.52కోట్ల బిల్లు అయ్యింది. అయితే తనకు అంత డబ్బు కట్టే స్థోమత లేదని ఆ వ్యక్తి విన్నవించుకున్నారు. ఇక ఈ విషయం కాస్త ఇండియా కాన్సులేట్ దగ్గరగా వెళ్లగా.. వారి విఙ్ఞప్తితో ఆసుపత్రి యాజమాన్యం అతడి బిల్లును మాఫీ చేసింది. ఆ తరువాత ఫ్లైట్ టికెట్ బుక్‌ చేసి, డబ్బులు ఇచ్చి రాజేష్‌ని భారతదేశానికి పంపింది. ఈ క్రమంలో రాజేష్ బుధవారం హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఇక ఆయనను 14 రోజుల హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు ఎన్నారై సెల్‌ సీనియర్ అధికారి చిట్టి బాబు పేర్కొన్నారు. కాగా తనపై దుబాయ్ ఆసుపత్రి చూపిన ఉదారతకు రాజేష్ వారికి తన కృతఙ్ఞతలను తెలిపారు.