Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ

|

Dec 25, 2020 | 8:08 AM

నగరంలోని మందుబాబుల తిక్క కుదర్చబోతున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను శుక్రవారం నుంచి పున:ప్రారంభించనున్నారు.

Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ
Follow us on

Drunk And Drive Tests :  నగరంలోని మందుబాబుల తిక్క కుదర్చబోతున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను శుక్రవారం నుంచి పున:ప్రారంభించనున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొంతకాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో..వారం రోజుల ముందు నుంచే ఈ ప్రత్యేక తనిఖీలు షురూ చేయనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ నిర్ధారించారు. నేటి నుంచి ప్రతిరోజు నగరంలో డ్రంక్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని చెప్పారు. ఇక రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫేస్‌ షీల్డ్‌లు ధరించి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయనున్నారు. బ్రీత్‌ అనలైజర్‌కు ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేసి, భౌతిక దూరం పాటిస్తూ ఈ టెస్టులు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగి నడిపుతూ పట్టుబడితే బండిని సీజ్ చేయడంతో పాటు‌ భారీగా జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శృతి మించితే జైలు శిక్షలు కూడా పడతాయని చెబుతున్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండువగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..