భీమవరంలో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు!

భీమవరంలో డ్రగ్స్ మాఫియా గుట్టువిప్పారు పోలీసులు. కురెళ్ళ భానుచందర్ అనే వ్యక్తి నెదర్లాండ్స్ నుండి భీమవరంకు డ్రగ్స్ తెప్పించి సరఫరా చేస్తున్నాడు.

భీమవరంలో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు!

Edited By:

Updated on: Jun 23, 2020 | 6:37 PM

Drugs Mafia in Bhimavaram: భీమవరంలో డ్రగ్స్ మాఫియా గుట్టువిప్పారు పోలీసులు. కురెళ్ళ భానుచందర్ అనే వ్యక్తి నెదర్లాండ్స్ నుండి భీమవరంకు డ్రగ్స్ తెప్పించి సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేస్తున్న భానుచందర్ కు అతని తోడల్లుడు పూర్ణచంద్రరావు సహకరిస్తున్నాడు. భానుచందర్, పూర్ణచంద్రరావు దగ్గర నుండి డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి సుమారు ఏడు కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.