జూనియర్ డాక్టర్ల నిరసనపై.. హీరో రాజశేఖర్ ఏమన్నారంటే..?

| Edited By:

Aug 07, 2019 | 8:05 PM

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు ప్రముఖ హీరో రాజశేఖర్ మద్దతు తెలిపారు. ఇప్పటివరకూ నటీనటులు ఎవరూ ఎన్.ఎం.సి బిల్లు పై స్పందించలేదు. రాజశేఖర్ స్పందించడంతో జూనియర్ డాక్టర్ల నిరసనకు ప్రచారం దక్కినట్లైంది. ఎన్ఎంసీ బిల్లులో కొన్ని పరిమితులు ఉంటాయని ఆయన చెప్పారు. ఎంబిబిఎస్ చదివి, తరువాత హౌస్ సర్జన్ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఆరు నెలలు క్రాష్ కోర్స్ చేస్తే సులభంగా డాక్టర్లు కావొచ్చంటే ఎలా? అని ఆయన […]

జూనియర్ డాక్టర్ల నిరసనపై.. హీరో రాజశేఖర్ ఏమన్నారంటే..?
Follow us on

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు ప్రముఖ హీరో రాజశేఖర్ మద్దతు తెలిపారు. ఇప్పటివరకూ నటీనటులు ఎవరూ ఎన్.ఎం.సి బిల్లు పై స్పందించలేదు. రాజశేఖర్ స్పందించడంతో జూనియర్ డాక్టర్ల నిరసనకు ప్రచారం దక్కినట్లైంది. ఎన్ఎంసీ బిల్లులో కొన్ని పరిమితులు ఉంటాయని ఆయన చెప్పారు. ఎంబిబిఎస్ చదివి, తరువాత హౌస్ సర్జన్ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఆరు నెలలు క్రాష్ కోర్స్ చేస్తే సులభంగా డాక్టర్లు కావొచ్చంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి బిల్లును ఒక వైద్యుడిగా తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. క్రాష్ కోర్స్ చేయడానికి వైద్యవృత్తి ఏమైనా డ్రాయింగా? పెయింటింగా? అని రాజశేఖర్ ప్రశ్నించారు. ఇంజినీరింగ్, ఎంబిబిఎస్ బదులు క్రాష్ కోర్సులు పెడితే బిల్డింగులు కూలిపోతాయని ఆయన మండిపడ్డారు.