పవన్ ‘వకీల్ సాబ్’ అయితే.. నేను ‘డైరెక్టర్ సాబ్’!

పవన్ కళ్యాణ్ టైటిల్‌.. కుర్చున్న స్టైల్‌ని.. అనుకరించి, వర్మ సేమ్ స్టైల్ ఉన్న ఫొటోను యాడ్‌ చేస్తూ.. డైరెక్టర్ సాబ్ అని పెట్టి ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేశారు. దాంతో పాటు..

పవన్ వకీల్ సాబ్ అయితే.. నేను డైరెక్టర్ సాబ్!

Edited By:

Updated on: Mar 02, 2020 | 8:56 PM

ఏ వివాదంలోనైనా.. ముందుండే వ్యక్తి ఆర్జీవీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్వీట్స్ చేస్తూ ఒక్కొక్కర్ని టార్గెట్ చేస్తూంటారు. ఇప్పుడు మరోసారి.. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశారు. ఇటీవల పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మాణంలో.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ సినిమా తెరకెక్కుతోంది. అమితాబ్ నటించిన ‘పింక్’ సినిమా రీమేక్‌లో ‘లాయర్ పాత్ర’లో పవన్ నటిస్తున్నారు. తాజాగా కాసేపటి క్రితమే ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో పాటు ఆయన ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఇప్పుడు ఆ టైటిల్‌ని.. పవన్ కుర్చున్న స్టైల్‌ని.. అనుకరించి, వర్మ సేమ్ స్టైల్ ఉన్న ఫొటోను యాడ్‌ చేస్తూ.. డైరెక్టర్ సాబ్ అని పెట్టి ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేశారు. దాంతో పాటు.. ‘I don’t think some idiot did not do this non idiotic thing’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొంతమంది సూపర్ అంటూ ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఓ రేంజ్‌లో వర్మని ఆడేసుకుంటున్నారు.