బాలయ్యా.. కరుణించేది ఎప్పుడయ్యా..

ఒకప్పుడు ఆయన సినిమాలు చూస్తే.. థియేటర్‌లో విజిల్స్, కేకలు వినపడేవి. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చెర్రీ హీరోగా తీసిన వినయ విధేయ రామా సినిమా డీలా పడటంతో దర్శకుడు బోయపాటికి క్రేజ్ కూడా తగ్గిపోయింది. దీంతో తదుపరి ప్రాజెక్టు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలయ్య హీరోగా, బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలుకావాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. హై బడ్జెట్ కారణంగానే సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లకుండా ఆలస్యం […]

బాలయ్యా.. కరుణించేది ఎప్పుడయ్యా..

Edited By:

Updated on: Jul 01, 2019 | 2:12 PM

ఒకప్పుడు ఆయన సినిమాలు చూస్తే.. థియేటర్‌లో విజిల్స్, కేకలు వినపడేవి. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చెర్రీ హీరోగా తీసిన వినయ విధేయ రామా సినిమా డీలా పడటంతో దర్శకుడు బోయపాటికి క్రేజ్ కూడా తగ్గిపోయింది. దీంతో తదుపరి ప్రాజెక్టు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బాలయ్య హీరోగా, బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలుకావాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. హై బడ్జెట్ కారణంగానే సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లకుండా ఆలస్యం అవుతోందని సమాచారం. చివరికి 60 కోట్ల బడ్జెట్‌ను బోయపాటి 40 కోట్లకు కుదించినా సినిమా ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలియని పరిస్థితి. అయితే బాలయ్య సూచన మేరకు బోయపాటి కథలో మార్పులు కూడా చేసాడట. కాగా స్క్రిప్ట్ లో చేసిన మార్పులు గురించి ఇప్పటికే బాలయ్యకి కూడా వినిపించినట్లు తెలుస్తోంది. కాని ఇప్పటివరకూ దీనిపై బాలకృష్ణ స్పందించలేదని తెలుస్తోంది. కాగా వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా..? రాదా..? మరి బోయపాటి బాలయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి బాలయ్యతో బోయపాటి చిత్రం హిట్ అయితే మాత్రం మళ్లీ ఆ దర్శకుడికి మంచి రోజులు వచ్చినట్లే..